Share News

హామీలు నెరవేర్చాలని ఆశా వర్కర్ల ధర్నా

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:48 PM

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు 18 వేల రూపాయలు చెల్లించాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

 హామీలు నెరవేర్చాలని ఆశా వర్కర్ల ధర్నా

పెద్దపల్లిటౌన్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు 18 వేల రూపాయలు చెల్లించాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి. జ్యోతి మాట్లాడుతూ.. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశాలకు బడ్జెట్‌లో నిరాశే మిగిలిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.18 వేల వేతనం ఇస్తానన్న హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఇందుకోసం పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 15 వందల వేత నం పెంచామని పార్లమెంటులో ప్రకటించినప్పటికీ అందలేదని, ఫిబ్రవరి నెల వేతనం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నాయ కులు సిపెళ్లి రవీందర్‌, యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే రూపా రాణి, టి శారద, ఎం సువర్ణ, వి. అమృత,సరోజన, లత రాజేశ్వరి, రజిత గౌతమి పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:48 PM