ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:34 PM
ధాన్యం కొనుగోళ్లకు అవస రమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లకు అవస రమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ధాన్యం నిల్వకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రణాళికను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. మండలాల వారీగా పంట కోతల షెడ్యూల్‌కు అనుగుణంగా అవసరమైన ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించాలని సూచించారు. ఎఫ్‌ఏక్యూ నాణ్యత ప్రమా ణాలపై రైతులకు అవగాహన కల్పించాలని, నాణ్యత ప్రమాణా లకు అనుగుణంగా ఉన్న ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా రైతులకు ముందుగానే సూచనలు అందించాలని తెలిపారు. నాణ్యత ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించ డంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాలన్నారు. దాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ బ్యాగుల లభ్యతపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సామగ్రి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ధాన్యం శుభ్రపరిచే, తూకం, తేమ శాతం కొలిచే యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా ముందు గానే క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉండేలా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఎఫ్‌ఏక్యూ నాణ్యత ప్రమాణాలు, పరికరాల వినియోగం తదితర అంశాలపై అవసరమైన శిక్షణ అందించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా సం బంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయా లని ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, మేనేజర్ శ్రీకాంత్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీమాల, ఎస్‌డబ్ల్యూసీ రీజినల్ మేనేజర్, అధికారులు పాల్గొన్నారు.