Share News

విద్యా ప్రమాణాల పెంపుపై ప్రశంస

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:14 AM

విద్యా ప్రమాణాల పెం పులో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపిన కలెక్టర్‌ కోయశ్రీహర్షతో పాటు జిల్లా విద్యాధికారులకు ప్రశంస లభించింది. శుక్రవారం హైద రాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌, ముఖ్యమంత్రి కలెక్టర్‌ కోయశ్రీహర్షకు ప్రశంసాపత్రం అందించి సన్మా నించారు.

విద్యా ప్రమాణాల పెంపుపై ప్రశంస

పెద్దపల్లి కల్చరల్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): విద్యా ప్రమాణాల పెం పులో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపిన కలెక్టర్‌ కోయశ్రీహర్షతో పాటు జిల్లా విద్యాధికారులకు ప్రశంస లభించింది. శుక్రవారం హైద రాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌, ముఖ్యమంత్రి కలెక్టర్‌ కోయశ్రీహర్షకు ప్రశంసాపత్రం అందించి సన్మా నించారు. విద్యారంగంలో నాణ్యతాభివృద్ధి, విద్యార్థుల అభ్యసన ఫలి తాల మెరుగుదల, పాఠశాలల సమర్థ నిర్వహణలో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలపడంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాభివృద్ధికి కృషి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ఆయన కోరారు.

Updated Date - Jun 20 , 2026 | 12:14 AM