Share News

గృహజ్యోతి పథకం వర్తింపజేయండి

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:18 AM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయాలని పెద్దపల్లి పట్టణానికి చెందిన విఠల్‌ కలెక్టర్‌ కోయ శ్రీహర్షను వేడుకోగా పరిశీలించాలని కలెక్టర్‌ మున్సిప ల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సం దర్భంగా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ డి వేణుతో కలిసి కలెక్టరేట్‌లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

గృహజ్యోతి పథకం వర్తింపజేయండి

పెద్దపల్లి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయాలని పెద్దపల్లి పట్టణానికి చెందిన విఠల్‌ కలెక్టర్‌ కోయ శ్రీహర్షను వేడుకోగా పరిశీలించాలని కలెక్టర్‌ మున్సిప ల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సం దర్భంగా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ డి వేణుతో కలిసి కలెక్టరేట్‌లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పెద్దపల్లి మండలం రంగాపూర్‌ గ్రామానికి చెందిన గండు రాజయ్య తనకు ఎకరం 5 గంటల వ్యవసాయ భూమి ఉందని, వీఎస్‌బీ బ్రిక్స్‌ నుంచి వచ్చే దుమ్ము ధూళి బూడిద వల్ల కూరగాయల పంటకు నష్టం వస్తుందని, బ్రిక్స్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. పెద్దపల్లి పట్టణం హనుమాన్‌నగర్‌కు చెందిన ఎర్రం వరలక్ష్మి తనకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, తనను ఎవరు చూసుకోవడం లేదని వృద్ధుల పోసిన సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఆర్డీవో పెద్దపల్లికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన కుమారస్వామి తమకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్‌కు రాస్తూ అవసరమైన చర్యలు తీసు కోవాలని కలెక్టర్‌ తెలిపారు. సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రాజేశ్వరరావు గ్రామ శివారు సర్వే నెంబర్‌ 330 నుంచి 331లో గల కాలువలో మట్టి తీయాలని దరఖాస్తు చేసుకోగా ఈఈ ఇరిగే షన్‌కు రాస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి పరిష్కరించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటిని వాపస్‌ ఇచ్చిన దంపతులు

పెద్దపల్లి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్‌ బెడ్‌రూం ఇంటి మంజూరు పత్రాలను పెద్దపల్లి పట్టణానికి చెం దిన వరహగిరి శైలజ, వెంకట్రావు దంపతులు స్వచ్ఛందంగా తిరిగి కలె క్టర్‌ కోయ శ్రీహర్షకు వాపస్‌ ఇచ్చారు. పట్టణ శివారులోని రాంపెల్లిలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లల్లో సీ బ్లాక్‌లో సి-9 ఇల్లును మూడు మాసాల క్రితం వరహగిరి శైలజకు కేటాయించారు. అయితే తమ పిల్లలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో స్థిరపడడంతో తమకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అవ సరం లేదని భావించారు. మరెవరైనా పేదలకు అందించాలని సోమవా రం వారికి కేటాయించిన మంజూరు పత్రాలను కలెక్టర్‌కు అందించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వారిని అభినందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తిని తిరిగి ఇచ్చిన శైలజ దంపతులు నిజాయితీకి నిదర్శనమని పేర్కొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 12:18 AM