Share News

సింగరేణిలో మరో కార్మిక సంఘం

ABN , Publish Date - May 04 , 2026 | 12:02 AM

సింగ రేణిలో మరో కొత్త కార్మిక సంఘం పురుడు పోసుకోనున్నది. వామపక్ష కార్మిక ఉద్యమాల నుంచి ఎదిగిన కార్మిక నాయకుడు కెంగర్ల మల్లయ్య నేతృత్వంలో కొత్త కార్మిక సంఘం పుట్టుకువస్తున్నది. సోమవారం ఉదయం మేడా రం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో సంఘాన్ని ఆవిష్కరించనున్నారు.

సింగరేణిలో మరో కార్మిక సంఘం

గోదావరిఖని మే 3 (ఆంధ్రజ్యోతి): సింగ రేణిలో మరో కొత్త కార్మిక సంఘం పురుడు పోసుకోనున్నది. వామపక్ష కార్మిక ఉద్యమాల నుంచి ఎదిగిన కార్మిక నాయకుడు కెంగర్ల మల్లయ్య నేతృత్వంలో కొత్త కార్మిక సంఘం పుట్టుకువస్తున్నది. సోమవారం ఉదయం మేడా రం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో సంఘాన్ని ఆవిష్కరించనున్నారు. అందుకోసం సింగరేణి 11 డివిజన్‌ల నుంచి కార్మికులు, నాయకులు హాజరుకానున్నారు. మల్లయ్య ప్రారంభిస్తున్న కొత్త కార్మిక సంఘానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య(టీజీబీకేఎస్‌)గా నామకరణం చేయనున్నారు. ఈ సంఘానికి ఈ/2926 నంబర్‌గా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. 1774లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాంచీ(బీహార్‌) ప్రాంతంలో మే 4వ తేదీన మొదటి బొగ్గు గనిని ప్రారంభించింది. బొగ్గు గని ప్రారంభమై రోజునే ప్రామాణి కంగా తీసుకుని కొత్త సంఘాన్ని ప్రకటించనున్నారు. జూన్‌లో సమావే శాలు ఏర్పాటుచేసి 11 డివిజన్‌లకు కన్వీనర్‌లను నియమించి, త్వరలోనే మహాసభ నిర్వహించి కేంద్ర, డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో సింగరేణి కార్మికులను ఉద్యమం వైపు మళ్ళించేందుకు మల్లయ్య నాయకత్వంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) ఏర్పడింది. ఉద్యమ సాధన పోరాటాల్లో అనేక సమ్మెలతోపాటు సకల జనుల సమ్మె నిర్వ హణలో కీలకపాత్ర పోషించింది. ఈసందర్భంలోనే టీబీజీకేఎస్‌ రెండు సార్లు సింగరేణి గుర్తింపు సంఘంగా విజయం సాధించింది. అంతర్గత విభేధాలతో మల్లయ్య టీబీజీకేఎస్‌ నుంచి బయటకు వచ్చారు. అనం తరం బీఎంఎస్‌లో కొంతకాలం పని చేసి దానిలో ఇమడలేక పోయాడు. రెండు మూడేళ్లుగా స్తబ్దంగా ఉన్న మల్లయ్య సింగరేణిలో కొత్త సంఘా న్ని ఏర్పాటు చేయడంపై చర్చ మొదలైంది. ఇప్పటికే సింగరేణిలో ఐదు జాతీయ సంఘాలు, టీబీజీకేఎస్‌, రెండు విప్లవ కార్మిక సంఘాలు క్రియా శీలంగా ఉన్నాయి. అయితే ఈమధ్య సింగరేణి ఆర్థిక ఇబ్బందులు, కార్మిక సంఘాల ప్రభావం తగ్గడం, ఏడాదిగా వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి మెడికల్‌ బోర్డు నిర్వహించకపోవడం వంటి పరిస్థితుల దృష్ట్యా మల్లయ్య ప్రారంభించనున్న కొత్త కార్మిక సంఘానికి ప్రాధాన్యం సంతరించుకున్నది.

Updated Date - May 04 , 2026 | 12:02 AM