రాజన్న కోడెలకు పశుగ్రాసం
ABN , Publish Date - May 17 , 2026 | 11:39 PM
పాడి పంటలు చల్లగా ఉంటున్నాయని, ఇందుకు వేములవాడ రాజన్న కరుణ కటాక్షములే కారణమని భావించిన రైతులు వరి కోతల వల్ల వచ్చిన పశుగ్రాసాన్ని రాజన్న ఆలయం కోడెలకు తరలిస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు.
సుల్తానాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): పాడి పంటలు చల్లగా ఉంటున్నాయని, ఇందుకు వేములవాడ రాజన్న కరుణ కటాక్షములే కారణమని భావించిన రైతులు వరి కోతల వల్ల వచ్చిన పశుగ్రాసాన్ని రాజన్న ఆలయం కోడెలకు తరలిస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. సుల్తానాబాద్ మండలం కనుకుల రామునిపల్లి మారుతినగర్, తొగర్రాయి, మంచరామి గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఐదారేళ్ళు గా ప్రతీ వరి కోతల అనంతరం వచ్చిన పశుగ్రాసాన్ని వేములవాడ రాజరాజేశ్వర సామి ఆలయంలోని కోడెల కోసం తరలిస్తున్నారు. ఈ ఏడాది కూడా అరవై ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని స్వామి వారి కోడెలకు అప్పగించారు.
ఆదివారం గ్రామంలో పశుగ్రాసంతో లోడ్ చేసిన ట్రాక్టర్లకు అర్చకులు కాండూరి వాసు ద్వారా ప్రత్యేక పూజలు చేయించారు. ట్రాక్టర్ల కు సర్పంచ్ కర్రె కవితకుమార్ జెండా ఊపారు. జానకి రామా ట్రాక్టర్ అసోసియేషన్ యజమానులు ట్రాక్టర్ నడుపుకుంటూ వేములవాడకు బయలుదేరారు. వారికి సుల్తానాబాద్ లో స్వాగతం పలికి రైతులకు అభినందనలు తెలిపారు. ఉప సర్పంచ్ వడ్లకొండ వివేక్, మార్కెట్ డైరెక్టర్ ఇల్లెందులు శ్రీనివాస్ గౌడ్, వెంకటరాంరెడ్డి, జానకి రామ ట్రాక్టర్ ఓనర్స్ అసోసియోషన్ అధ్యక్షుడు యాశాడపు రాజశేఖర్, ఉపాద్యక్షులు అన్నవేని మొగిలి, జయపాల్, సుదాకర్‌రెడ్డి, రాంరెడ్డి, బొల్లం కుమార్, మారెల్లి శివ, రాంచంద్రం నూనె నరేష్ తదితరులు పాల్గొన్నారు.