Share News

సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీల ధర్నా

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:49 PM

సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీ యూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు.

సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీల ధర్నా

పెద్దపల్లిటౌన్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీ యూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ 35 ఏళ్ళుగా గర్భిణీ, బాలింతలు, పిల్లలకు సేవలు అందిస్తున్న టీచర్లకు హెల్పర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు, పీఎఫ్‌ సౌకర్యం కల్పిం చడం లేదన్నారు. పాఠశాలలకు ప్రీ పైమ్రరీ అనుసంధానం చేస్తే ఐసీడీ ఎస్‌ నిర్వీర్యం అవుతుందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు కూడా ఒక్కపూట బడి సర్కులర్‌ జారీ చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న గ్యాస్‌, కూరగాయల బిల్లులు విడుదల చేయాలని, ప్రభుత్వ హామీలు అమలు చేయకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రం అం దజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి జ్యోతి, జి భార్గవి, ఎం హేమలత, రాజేశ్వరి, చంద్రకళ, స్వప్న, సుమలత, స్వరూప, సునీత పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 11:49 PM