Share News

22న అంబేద్కర్‌ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు

ABN , Publish Date - Nov 15 , 2026 | 10:55 PM

ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ యువజన సంఘం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 22న జిల్లా కేం ద్రంలోని ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించనున్న స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని స్వర్ణోత్సవ కమిటీ చైర్మన్‌, సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్య క్షుడు మామిడిపల్లి బాపయ్య పిలుపునిచ్చారు.

22న అంబేద్కర్‌ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు

పెద్దపల్లి టౌన్‌,నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ యువజన సంఘం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 22న జిల్లా కేం ద్రంలోని ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించనున్న స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని స్వర్ణోత్సవ కమిటీ చైర్మన్‌, సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్య క్షుడు మామిడిపల్లి బాపయ్య పిలుపునిచ్చారు. ఆదివారం ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ పరిధి నుంచి సంఘం నాయ కులు, సభ్యులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. వేడు కలకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణా రావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. సంఘం బలోపేతానికి కృషి చేస్తున్న సుమారు వెయ్యి మంది నాయకులు, కార్యకర్తలకు స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రత్యేక జ్ఞాపికలు అందజేయనున్నట్లు వెల్లడించారు. స్వర్ణోత్సవ కమిటీ కన్వీనర్‌ మైస రాజేష్‌, వైస్‌ చైర్మన్‌ లంక సదయ్య, సమన్వయకర్త కుక్క అశోక్‌, కో-కన్వీనర్‌ పొనుగంటి రాజనర్సు, సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 10:55 PM