వాకర్స్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నా
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:15 AM
వాకర్స్ సంక్షేమా నికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. శ్రీ కోదండ రామా లయం ఆవరణలో శనివారం జరిగిన దరూర్ క్యాంప్ వాకర్స్వెల్ఫేర్ అసోసియేషన్ నూతనకార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నూతన కార్యవర్గసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
జగిత్యాల టౌన్, అక్టోబరు 17 (ఆంరఽధజ్యోతి): వాకర్స్ సంక్షేమా నికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. శ్రీ కోదండ రామా లయం ఆవరణలో శనివారం జరిగిన దరూర్ క్యాంప్ వాకర్స్వెల్ఫేర్ అసోసియేషన్ నూతనకార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నూతన కార్యవర్గసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్ష ణకు నిత్యం వాకింగ్ చేయాలని సూచించారు. దరూర్ క్యాంప్ గ్రౌండ్లో వాకర్స్‌కు అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కౌన్సి లర్ బోయినిపల్లి ప్రశాంత్‌రావు, అసోసియేషన్ అధ్య క్షుడు గాడిపెల్లి చంద్రశేఖర్‌గౌడ్, ప్రధానకార్యదర్శి ద్యావనపెల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడువిఠల్, తదితరులున్నారు.
రైతుల సంక్షేమం,
అభివృద్ధికి కృషిచేయాలి..
జగిత్యాల అగ్రికల్చర్ : రైతుల సంక్షేమం, అభివృద్ధియే లక్ష్యంగా నూతన పాలకవర్గం కృషిచేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల వ్యవసాయ సహకార పరపతిసంఘం నూతన చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, వైస్ చైర్మెన్‌గా అబ్బూరి మల్లేశంగౌడ్ పాలకవర్గ ప్రమాణస్వీకారం స్థానిక ఎల్ఎల్ గార్డెన్లో రైతు సేవాసంకల్ప సభ పేరుతో నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు, నాయకులు, రైతులసమక్షంలో అట్టహాసంగా నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ పట్టణంలో మార్కెట్ల అభి వృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్యాక్స్‌చైర్మన్ కొలుగూరి దామోదర్‌రావు,వైస్ ఛైర్మెన్ అబ్బూరి మల్లేశంగౌడ్, డీసీసీ అధ్యక్షుడు గాజెంగినందయ్య, మున్సిపల్‌చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధికి
సహకారం అందిస్తాం..
రాయికల్ : గ్రామాభివృద్ధికి అవసర మైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మండలం లోని మైతాపూర్ దుర్గామాత ఆలయ ఆవ రణలో భక్తుల సౌకర్యార్థం గ్రామ పంచా యతీ నిధులు రూ.3లక్షలతో నిర్మించను న్న మరుగు దొడ్ల నిర్మాణపనులకు భూమిపూజ చేశారు. కార్యక్ర మంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, సర్పంచ్ తలారి నాగమణిరాజేష్, ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రవీందర్ రావు, పీఏసీఎస్ చైర్మన్లు ఏనుగుల మల్లారెడ్డి పాల్గొన్నారు.