Share News

మా ఊరి పిల్లలంతా ప్రభుత్వ బడికే

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:02 AM

పెరుకపల్లి గ్రామ ప్రజలంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని శనివారం నిర్ణయం తీసుకున్నారు. మండల విద్యాధికారి పి. ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహిం చిన బడిబాటలో గ్రామ పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.

మా ఊరి పిల్లలంతా ప్రభుత్వ బడికే

ధర్మారం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): పెరుకపల్లి గ్రామ ప్రజలంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని శనివారం నిర్ణయం తీసుకున్నారు. మండల విద్యాధికారి పి. ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహిం చిన బడిబాటలో గ్రామ పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు. ఇల్లూ ఇల్లూ తిరుగుతూ మన పిల్లల్ని మన ఊరి ప్రభుత్వ బడిలోనే చది వించకుందామని, నాణ్యమైన విద్యతో పాటు, రుచికరమైన భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం ప్రభుత్వం సమకూరుస్తుండగా ప్రైవేటు బడికి ఎందుకు పంపాలంటూ పునరాలోచించారు. గ్రామంలోని కొందరు ఉపాధిహామీ పనులకు వెళ్లగా ఉపాధ్యాయులు, ప్రజాప్రతిని ధులు కూలీల వద్దకు వెళ్లి సమావేశమయ్యారు. సర్పంచ్‌ గొల్ల కృష్ణతో పాటు ఉప సర్పంచ్‌ మొట్టె తిరుపతి, వార్డు సభ్యులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలోనే చదివిస్తామని చెప్పడంతో ఉపాధిహామీ కూలీలు కూడా పిల్లలను చేర్పిస్తామన్నారు. గ్రామంలో ప్రతీ ఇంటిని సందర్శించా మని ఎంఈఓ తెలిపారు. ఏఏసీసీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మీ, పీఎస్‌హెచ్‌ఎం స్వామినాయక్‌, అంగన్వాడీ టీచర్‌ పద్మ, సుమలత ఉన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:03 AM