Share News

ఖనిలో ఘనంగా అలయ్‌ బలయ్‌

ABN , Publish Date - Oct 25 , 2026 | 11:42 PM

దసరా పండుగను పురస్కరించుకుని సామాజిక ఐక్య వేదిక కన్వీనర్‌ క్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని మార్కండేయకాలనీలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఖనిలో ఘనంగా అలయ్‌ బలయ్‌

కళ్యాణ్‌నగర్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): దసరా పండుగను పురస్కరించుకుని సామాజిక ఐక్య వేదిక కన్వీనర్‌ క్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని మార్కండేయకాలనీలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్వీనర్‌ క్యాతం వెంకటరమణ మాట్లాడుతూ సమాజ హితం కోసం అందరిని ఏకతాటిపైకి తీసుకురావడానికి 14సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నాయకులు కందుల సంధ్యారాణి, వ్యాళ్ల హరీష్‌రెడ్డి, మార్కపురి సూర్య, తోట మమత, తాండ్ర సదానందం, కనకరాజు, పద్మ, రమాదేవి, శ్రీనివాస్‌, రాజేష్‌ పాల్గొన్నారు. అనంతరం అతిథులకు తెలంగాణ వంటకాలతో భోజనం వడ్డించారు.

Updated Date - Oct 25 , 2026 | 11:42 PM