Share News

మారు పేర్ల బాధితులకు అండగా ఏఐటీయూసీ

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:55 PM

మారుపేర్లు, విజిలెన్స్‌ బాధితుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ అం డగా ఉంటుందని ఆర్జీ-2 బ్రాంచి సెక్రెటరీ గంధం సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివా రం స్థానిక ఏఐటీయూసీ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగ రేణిలో మారుపేర్లు, విజిలెన్స్‌ కేసుల కార ణంగా బాధితులైన కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం ఏళ్ళ తరబడి పోరాటాలు చేస్తున్నట్టు తెలిపారు.

మారు పేర్ల బాధితులకు అండగా ఏఐటీయూసీ

యైుటింక్లయిన్‌కాలనీ, ఆగస్టు 16 (ఆంధ్ర జ్యోతి): మారుపేర్లు, విజిలెన్స్‌ బాధితుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ అం డగా ఉంటుందని ఆర్జీ-2 బ్రాంచి సెక్రెటరీ గంధం సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివా రం స్థానిక ఏఐటీయూసీ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగ రేణిలో మారుపేర్లు, విజిలెన్స్‌ కేసుల కార ణంగా బాధితులైన కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం ఏళ్ళ తరబడి పోరాటాలు చేస్తున్నట్టు తెలిపారు. యాజమాన్యం వారి సమస్యలను పట్టించుకోలేదన్నారు. విసిగిన బాధితులు మూడు రోజులుగా సింగరేణి హెడాఫీస్‌ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని, వారి పోరాటానికి మద్దతు తెలు పుతున్నట్టు పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించి వెంటనే మారు పేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. స్ట్రక్చర్‌ సమావేశాల్లో గుర్తింపు సంఘం హోదాలో మారు పేర్లు, విజిలెన్స్‌ కేసులను ఒకే దఫాలో పరిష్కరించాలని యాజమాన్యం దృష్టికి తీసు కెళ్ళినట్టు తెలిపారు. న్యాయ సలహా తీసుకుని పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినా దాటవేత ధోరణి అవలంభించినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి బాధితులకు న్యాయం చేయాలని, దీక్ష చేస్తున్న బాధితుల ఆరోగ్యానికి పూర్తి బాధ్యత సింగరేణి యాజ మాన్యానిదేనని తెలిపారు. సమస్యలు పరిష్క రించకుంటే సింగరేణి వ్యాప్తంగా ఏఐటీ యూసీ ఆందోళన చేయనున్నట్టు తెలిపారు. రాజారత్నం, బుర్ర తిరుపతి, అన్నారావు, శ్యాంసన్‌, రవికుమార్‌, మహేందర్‌, సంపత్‌, మహేందర్‌ రాజు, శంకర్‌, రాజసాగర్‌, నారాయణ పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:55 PM