కార్మికుల సమస్యలు పట్టించుకోని ఏఐటీయూసీ
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:49 PM
గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికుల పక్షమా లేక యాజమాన్య పక్షమా అని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి ప్రశ్నించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ అయిలి శ్రీనివాస్‌తో కలసి మాట్లాడారు.
యైుటింక్లయిన్‌కాలనీ, జూలై 5(ఆంధ్రజ్యోతి): గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికుల పక్షమా లేక యాజమాన్య పక్షమా అని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి ప్రశ్నించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ అయిలి శ్రీనివాస్‌తో కలసి మాట్లాడారు. సింగరేణిలో టెండర్ల అవకతకలు, బొగ్గుతో పాటు సోలార్, ఎస్టీపీపీ, ఎక్స్‌ప్లోజివ్‌లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని ఆందోళన చేస్తే యాజమాన్యం తరపున ఏఐటీయూసీ ఎందుకు వకల్తా పుచ్చుకుంటుందని ప్రశ్నించారు. ఏఐటీయూసీకి చిత్తశుద్ధి ఉంటే సంస్థకు రావాల్సిన 50 వేల కోట్ల బకాయిలపై ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణిని ఆర్థికంగా నష్ట పరిచారని, కార్మికుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. కార్మికుల పక్షాన నిలవాల్సిన ఏఐటీయూసీ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నడుచుకుంటూ కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నట్టు రామ్మూర్తి విమర్శించారు. 11 వేజ్‌బోర్డు కాలపరిమితి ముగిసినా కేంద్రం కమిటీ వేయలేదని, దీనిపై జాతీయ సంఘాలు ఎందుకు నిర్లక్ష్యధోరణి చూపుతున్నాయో కార్మికులకు సమాధానం చెప్పాలన్నారు. ఆరు నెలల ముందే జాతీయ సంఘాలు ఉమ్మడి డిమాండ్ల ముసాయిదాని కేంద్రానికి సమర్పించి వేజ్‌బోర్డు సాధనకు ఉద్యమించాల్సి ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయన్నారు. సీపీఆర్‌ఎంఎస్ పేరిట 30 ఏళ్ల తర్వాత దిగిపోయే కార్మికుల నుండి రూ.40 వేల చొప్పున రికవరీ చేయడం, యూజీ అలవెన్స్‌లను 12.30 శాతం నుండి 9 శాతానికి తగ్గించడం, డీఏ పెరగక పోవడం జాతీయ సంఘాల వైఫల్యాలన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం, బకాయిల వసూళ్లకు యాజమాన్యంపై ఒత్తిడి చేయాలని సూచించారు. బేతి చంద్రయ్య, మామిడి తిరుపతి, అబ్బు శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతి, నరేష్, శశాంక్, రవీందర్, సుమన్ పాల్గొన్నారు.