వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి
ABN , Publish Date - May 02 , 2026 | 12:00 AM
ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులు అనుసరించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారి రైతులు ఆర్థికంగా ఎదుగుతారని పొలాస శాస్త్రవేత్త రమేష్ అన్నారు. శుక్రవారం రాంపల్లి రైతువేదికలో రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని వ్యవసాయాధికారులు నిర్వహించారు.
పెద్దపల్లి రూరల్, మే 1(ఆంధ్రజ్యోతి) : ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులు అనుసరించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారి రైతులు ఆర్థికంగా ఎదుగుతారని పొలాస శాస్త్రవేత్త రమేష్ అన్నారు. శుక్రవారం రాంపల్లి రైతువేదికలో రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని వ్యవసాయాధికారులు నిర్వహించారు. పొలాస శాస్త్రవేత్త రమేష్, రవళిలు మాట్లాడారు. రైతులు సాగు ఖర్చులను తగ్గించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పంటలు సాగు చేసే సమయంలో రసాయనాల వాడకం విచ్చలవిడిగా వేసి భూసారాన్ని నష్టం చేసుకోకూడదన్నారు. అనంతరం ఏవో నాగార్జున మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కనపర్తి సంపత్‌రావు, ఏఈవో ప్రశాంత్ , రైతులు పాల్గొన్నారు.
శాస్త్రీయ పద్ధతిలో సాగుతో అధిక లాభాలు
ఓదెల, (ఆంధ్రజ్యోతి) : రైతులు శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే అధిక లాభాలు పొందుతారని జగిత్యాల వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ తిరుపతి అన్నారు. శుక్రవారం గుండ్లపల్లి రైతువేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక సాగు పద్ధతులపై అవ గాహన కల్పించారు. రైతులు యూరియా, రసాయనాల వాడకాన్ని తగ్గిం చి, పంట మార్పిడి పాటించాలన్నారు. శాస్త్రవేత్తలు భాస్కర్, ఏవో, ఏఈవోలు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రవికుమార్, గుండ్లపల్లి మాజీ సర్పంచ్ పుప్పాల శంకర్, ప్రసాద్, పెద్దలు రైతులు పాల్గొన్నారు.