Share News

ఇంటింటా చెత్త సేకరణ బాధ్యత ఏజెన్సీలదే

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:08 AM

చెత్త సేకరణలో అమలు చేస్తున్న డ్రైవర్‌ కం ఆపరేటర్‌ పాలసీని రామగుండం నగరపాలక సంస్థలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పైలట్‌ ప్రాజెక్టుగా కార్పొరేషన్‌ పరిధిలోని ఏడు డివిజన్లలో ఇంటింటా చెత్త సేకరణ బాధ్యతను టెండర్‌ ద్వారా ఒక ఏజెన్సీకి అప్పగించారు.

ఇంటింటా చెత్త సేకరణ బాధ్యత ఏజెన్సీలదే

కోల్‌సిటీ, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, వరంగల్‌ వంటి నగరాల్లో చెత్త సేకరణలో అమలు చేస్తున్న డ్రైవర్‌ కం ఆపరేటర్‌ పాలసీని రామగుండం నగరపాలక సంస్థలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పైలట్‌ ప్రాజెక్టుగా కార్పొరేషన్‌ పరిధిలోని ఏడు డివిజన్లలో ఇంటింటా చెత్త సేకరణ బాధ్యతను టెండర్‌ ద్వారా ఒక ఏజెన్సీకి అప్పగించారు. పందుల పెంపకందారులకు పునరావా సం కల్పించేందుకు ప్రభుత్వం మొదట ఈ విధా నాన్ని ప్రవేశపెట్టింది. అలాగే కార్పొరేషన్‌పై ఆర్థిక భారం తగ్గించుకోవడం, సమర్థవంతంగా ఇంటింటా చెత్త సేకరణ చేయడం, పారిశుధ్య నిర్వహణ మెరు గుపర్చుకోవడం లక్ష్యాలతో రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. రామగుండంలో 34, 47, 49, 52, 40, 60, 51డివిజన్లలో ఈ విధానాన్ని ప్రవేశపె ట్టారు. కార్పొరేషన్‌కు చెందిన ఆటో ట్రాలీలనే ఈ ఏజెన్సీకి అప్పగిస్తారు. ఒక్కో ట్రాలీకి రూ.50వేల చొప్పున డిపాజిట్‌ చేయించుకున్నారు. ఈ ట్రాలీపై డ్రైవర్‌, లేబర్‌ పూర్తిగా ఏజెన్సీకి చెందిన వారే ఉం టారు. వారికి కేటాయించిన డివిజన్లలో 100శాతం ఇంటింటా చెత్త సేకరణ చేసి డంపింగ్‌ యార్డ్‌కు తర లిస్తారు. చెత్త ట్రాలీకి ఇవ్వకపోతే పారిశుధ్య విభాగం సిబ్బంది సంబంధిత ఇంటి యజమానులకు జరిమానా విధిస్తారు. కార్పొరేషన్‌ పరిధిలో 60 డివిజన్లకుగాను 40పైగా డివిజన్లలో పూర్తిగా, మరో 57డివిజన్లలో పాక్షికంగా కార్పొరేషన్‌ పారిశుధ్య సేవలందిస్తుంది. ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ టౌన్‌షిప్‌తో పాటు సింగరేణికి చెందిన కొన్ని డివి జన్లలో ఆయా సంస్థల యాజమాన్యాలే పారిశుధ్య సేవలందిస్తున్నాయి. ఒక్కో డివిజన్‌కు 700లకుపైగా గృహాల నుంచి చెత్త సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు ఆయా డివిజన్లలో ట్రాలీలపై పని చేస్తున్న డ్రైవర్లను ఇతర వాహనాలు, డివిజన్లకు సర్దుబాటు చేస్తున్నారు. ర్యాగ్‌ పిక్కర్లను కూడా ఇతర డివిజన్లకు కేటాయించారు. కొన్ని డివిజన్లలో ర్యాగ్‌ పిక్కర్లు తమకు డబ్బులు వసూలు కావాల్సి ఉందని, మరికొన్ని రోజులు అవకాశం కల్పించాలని అధికా రులను కోరుతున్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా ఈ విధా నం విజయవంతం అయితే కార్పొరేషన్‌లోని మరి కొన్ని డివిజన్లలో అమలు చేసేందుకు యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

Updated Date - Jun 14 , 2026 | 12:08 AM