Share News

పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలి

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:47 PM

గోదావరి పుష్కరాలను విజయవం తంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పక డ్బందీ కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణకు సంబంధించి జిల్లాలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, శాఖల వారీగా రూపొందించాల్సిన ప్రతిపాదనలపై శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు.

పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలి

పెద్దపల్లి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలను విజయవం తంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పక డ్బందీ కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణకు సంబంధించి జిల్లాలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, శాఖల వారీగా రూపొందించాల్సిన ప్రతిపాదనలపై శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు బి. శ్రీరాములు, జె. అరుణశ్రీలతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే యేడాది జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న పుష్క రాలకు సంబంధించి జిల్లాలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతీ శాఖ సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఆయా శాఖల పరిధిలో చేపట్టాల్సిన పనులు, వాటికి అవసరమయ్యే నిధులు, అంచనా వ్యయం, అవసరమైన సిబ్బంది వివరాలతో నివేదికలు రూపొందించాలని ఆదేశిం చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల ఏర్పాటు, విద్యుత్‌ దీపాలు, రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యాలు, పార్కింగ్‌ స్థలాల ఏర్పాటు అంశాలపై ప్రతిపాదనలు సమర్పిం చాలని తెలిపారు. విధుల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది సంఖ్యతోపాటు వారికి కల్పించాల్సిన వసతి, భోజనం, రవాణా వివరాలను ప్రతిపాదనల్లో స్పష్టంగా పేర్కొనాలన్నారు. సమగ్ర ప్రతిపాదనలను సోమవారం నాటికి తప్పనిసరిగా సమర్పించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రతిపాదనల ఆధారంగా తదుపరి కార్యాచరణ రూపొందించి, పుష్కరాల నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఆర్డీవో గంగయ్య, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:47 PM