సింగరేణి స్థలాలను ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - May 23 , 2026 | 11:58 PM
సింగ రేణి స్థలాలలో అక్రమంగా మసీదు, చర్చిలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శని వారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు.
గోదావరిఖని, మే 23(ఆంధ్రజ్యోతి): సింగ రేణి స్థలాలలో అక్రమంగా మసీదు, చర్చిలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శని వారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీం దర్, బజరంగ్‌దళ్ జిల్లా సంయోజక్ ముష్కే సంపత్‌యాదవ్ మాట్లాడుతూ గోదావరిఖని నడిబొడ్డున సింగరేణి సంస్థ గతంలో ప్రజల కోసం నిర్మించిన సులభ్‌కాంప్లెక్స్ మరుగు దొడ్డిని కూల్చి స్థలాన్ని క్రైస్తవులు ఆక్రమిం చారన్నారు. గతంలో సింగరేణి యాజమా న్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేద న్నారు. చర్చిలకు, మసీదులకు మతపరమైన దర్గాలకు వందల ఎకరాల స్థలాన్ని సింగరేణి కేటాయించిందని ఆరోపించారు. క్వార్టర్లలో సైతం మత మార్పిడులకు అనుకూలంగా చిన్నిచిన్న చర్చిలు ఏర్పాటు చేసినా పట్టించు కోవడం లేదన్నారు. హిందూ సంస్థలకు దేవాలయాలకు సంబంధించిన, కేటాయించిన స్థలాలను చిన్న కట్టడాలు జరిపిన అర్ధరాత్రి కూల్చివేసే సింగరేణి యాజమాన్యం చూస్తూ ఊరుకోవడం సిగ్గుచేటన్నారు. సింగరేణి స్థలాలను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. మునిగాల సంపత్, అడిగొప్పుల రాజు, ఆరెల్లి జలంధర్, వెంకటస్వామి, రాజు, అనిరుధ్, శివమోహన్, శ్రావణ్, శ్రీనివాస్, బాలు, రాజ్‌కుమార్, శేఖర్, శివ, రమేష్, ప్రశాంత్, అజిత్, కార్తీక్, ప్రకాష్ పాల్గొన్నారు.