స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించాలి
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:54 PM
రామగుండం నగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించేలా సిబ్బంది పని చేయాలని మేయర్ మహంకాళి స్వామి సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డ్రైవర్లు, పారిశుధ్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు.
కోల్‌సిటీ, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించేలా సిబ్బంది పని చేయాలని మేయర్ మహంకాళి స్వామి సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డ్రైవర్లు, పారిశుధ్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విధులు నిర్వహించే సమయంలో రక్షణ పరికరాలు ఉపయోగించాలని, వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో అధికారులు, శానిటేషన్ సిబ్బంది సేవలందించడంపై అభినందించారు. డ్రైవర్లు, డ్రైన్ క్లీనర్లు, జవాన్లు పని చేస్తూ సంస్థకు లక్షల రూపాయల ఆదాయాన్ని ఆదా చేస్తున్నారని, ప్రతి వాహనం నిత్యం 250ఇండ్ల నుంచి చెత్తను సేకరించాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆటోల మైక్‌లు పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నగరపాలక డీసీ నాయిని వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర్, ఈఈ పీవీ రామన్, డీఈ శాంతి స్వరూప్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శ్రీపాల్ పాల్గొన్నారు.