Share News

వలస కార్మికులకు వసతులు కల్పించాలి

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:27 PM

ఇతర రాష్ట్రాల నుంచి ఇటుక బట్టీ లలో పని చేసేందుకు వస్తున్న వలస కార్మి కులకు కనీస వసతులు కల్పించాలని జిల్లా ప్రఽధాన న్యాయమూర్తి కుంచాల సునిత అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా శుక్రవారం రాఘవ పూర్‌ ఇటుక బట్టీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

వలస కార్మికులకు వసతులు కల్పించాలి

పెద్దపల్లి రూరల్‌, జూన్‌ 12 (ఆంధ్ర జ్యోతి): ఇతర రాష్ట్రాల నుంచి ఇటుక బట్టీ లలో పని చేసేందుకు వస్తున్న వలస కార్మి కులకు కనీస వసతులు కల్పించాలని జిల్లా ప్రఽధాన న్యాయమూర్తి కుంచాల సునిత అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా శుక్రవారం రాఘవ పూర్‌ ఇటుక బట్టీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధా న న్యాయమూర్తి సునిత, న్యాయ సేవాధికార సంస్థ భవానితో కలిసి పాల్గొన్నారు. జిల్లా న్యాయమూర్తి సునిత మాట్లాడుతూ వలస కార్మికులకు వసతి, వారి పిల్లలకు విద్యాబో ధన అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ వలస కార్మికులకు కార్మిక శాఖ ద్వారా అందించే లేబర్‌ కార్డు ఉండాలని, వారికి బ్యాంకు ఖాతాల ద్వారా కూలీల వేతనాలు చెల్లించాలని తెలిపారు. కార్మిక శాఖ చట్టాలు, నిబంధనలు పాటించాలని, వాటిని ఇటుక బట్టీల యజమానులు పాటించా లన్నారు. తహసీల్దార్‌ రాజయ్య, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ రఫీ పలువురు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 11:27 PM