పన్ను వసూళ్లలో వేగం పెంచండి
ABN , Publish Date - Oct 23 , 2026 | 11:32 PM
రామగుండం కార్పొరేషన్లో పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని నగరపాలక కమిషనర్ అరుణశ్రీ సూచించారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ, వార్డు అధికారులు, సహాయ కులు, సిబ్బందితో పన్ను వసూళ్ల పురో గతిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహిం చారు.
కోల్సిటీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్లో పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని నగరపాలక కమిషనర్ అరుణశ్రీ సూచించారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ, వార్డు అధికారులు, సహాయ కులు, సిబ్బందితో పన్ను వసూళ్ల పురో గతిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహిం చారు. ఆమె మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆదాయం మెరుగుపర్చడానికి లక్ష్యం ప్రకారం ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలని, అనుమతి లేని కట్టడాలకు 100శాతం పెనాల్టీ విధించాలని ఆదేశాలు జారీ చేశారు. నివాస గృహ అనుమతి పొంది వాణిజ్య భవనాలుగా మార్చిన వారికి నోటీసులు జారీ చేయాలని, దీర్ఘకాలంగా పన్ను బకాయిలు ఉన్న వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటు చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇండ్లు, భవనాల వివరాలను సేకరించి జియో ట్యాగింగ్ చేయడానికి నిర్వహిస్తున్న భువన్ సర్వే శనివారం నాటికి పూర్తి చేయాలని కోరారు. డీసీ నాయిని వెంకటస్వామి, సెక్రటరీ మహేశ్వరిరెడ్డి, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఖాజా, సౌమ్య పాల్గొన్నారు.