Share News

ఘనంగా కామ దహనం

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:59 PM

హోలీ పండుగను పురస్కరించుకుని సుల్తానాబాద్‌ పట్టణంలో సోమవారం కామ దహనం వేడుకలను మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాక్రిష్ణ సమత దంపతులు సోమవారం రాత్రి ప్రారంభించారు.

ఘనంగా కామ దహనం

సుల్తానాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): హోలీ పండుగను పురస్కరించుకుని సుల్తానాబాద్‌ పట్టణంలో సోమవారం కామ దహనం వేడుకలను మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాక్రిష్ణ సమత దంపతులు సోమవారం రాత్రి ప్రారంభించారు. కామ దహనం కోసం నిర్వాహకులు ఇంటింటికీ తిరుగుతు దహన కార్యక్రమానికి అవసరమైన కర్రలను సమిదలను సేకరించారు. అనంతరం పాత జెండా వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సమిదలను పేర్చి కామ దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైర్మన్‌ బిరుదు రాధాక్రిష్ణ మాట్లాడుతు హోలీ పండుగకు ముందు రోజు కామ దహన వేడుకలను నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమన్నారు. గుడిమిట్టపల్లి ఆలయ పండతులు అశోక్‌, వికాస తరంగిణీ అధ్యక్షుడు సుగుణాకర్‌, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొమురవెళ్లి భాస్కర్‌, స్వర్ణకార సంఘం నాయకులు ప్రకాశ్‌ రావు, అంజన్న, గడ్డం శ్రీనివాస్‌, రాములు గౌడ్‌, రామిడి రవి, ఆకుల శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): హోలీ పండుగ సందర్భంగాశ్రీసీలేశ్వర-సిద్దేశ్వరాలయం, లక్ష్మినారాయణస్వామి, పెంజేరుకట్ట హనుమాన్‌ ఆలయ సమీపంలో కామ దహన వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో కాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాలు సమర్పించి దహన వేడులను శాస్రొక్తంగా నిర్వహించారు. భక్తులు కాముడిని దర్శించుకొని దహన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Mar 02 , 2026 | 11:59 PM