Share News

మహిళలకు అండగా నిలుస్తున్న సేవా సమితి

ABN , Publish Date - Mar 27 , 2026 | 11:26 PM

మహిళలకు సింగరేణి సేవా సమితి అండగా నిలు స్తోందని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ సతీమణి మనాలి ఠాకూర్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని పురస్కరించుకొని సింగరేణి సేవా సమితి, లేడిస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బంగ్లాస్‌ ఏరియాలో గురు వారం రాత్రి సేవా సమితి అధ్యక్షురాలు డీ అనిత లలిత్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు.

మహిళలకు అండగా నిలుస్తున్న సేవా సమితి

గోదావరిఖని, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మహిళలకు సింగరేణి సేవా సమితి అండగా నిలు స్తోందని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ సతీమణి మనాలి ఠాకూర్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని పురస్కరించుకొని సింగరేణి సేవా సమితి, లేడిస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బంగ్లాస్‌ ఏరియాలో గురు వారం రాత్రి సేవా సమితి అధ్యక్షురాలు డీ అనిత లలిత్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్‌, అదనపు కలెక్టర్‌, కమిషనర్‌ అరుణశ్రీ, పోలీస్‌ కమి షనర్‌ సతీమణి డాక్టర్‌ త్రిప్తిజా, ఆర్‌జీ-1 ఏరియా జీఎం లలిత్‌కుమార్‌, ఆర్‌జీ-2 ఏరియా సేవా అధ్య క్షురాలు వనజ వెంకట య్య ప్రారంభించారు. మనాలీ ఠాకూర్‌ మాట్లా డుతూ సింగరేణి సేవా సమితి ద్వారా ఆర్‌జీ-1 సేవా అధ్యక్షురాలు మహిళలకు వివిధ శిక్షణలు ఇస్తూ వారిలోని నైపుణ్యాన్ని బయటికి తీస్తూ స్వయం ఉపాధి కలిపిస్తున్నారని కొనియా డారు. కమిషనర్‌ అరుణశ్రీ మాట్లాడుతూ ఇక్కడి వారికి స్వయం ఉపాధికి సింగరేణి సేవా సమితి తోడ్పాటు అందిస్తుందని, అందరు సద్విని యోగం చేసుకోవాలన్నారు. సేవా సభ్యులు, లేడిస్‌ క్లబ్‌ ఆధ్వ ర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టు కున్నా యి. అనంతరం సేవలందించిన మహిళలను సన్మా నించారు. సీఎంఓఐ అధ్యక్షుడు బీ మల్లేశం, ఎస్‌ఓ టూ జీఎం చంద్ర శేఖర్‌, పర్సనల్‌ మేనేజర్‌ రవీం దర్‌ రెడ్డి, సీనియర్‌ పీఓ హన్మంతరావు, సేవా సెక్ర టరీ బీనాసింగ్‌, జాయింట్‌ సెక్రటరీ రజిత, లేడిస్‌ క్లబ్‌ సెక్రటరి శిరీష చంద్ర శేఖర్‌, పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 11:26 PM