Share News

వానాకాలం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:50 PM

డివిజన్‌ వారీగా వర్షాకాల సన్నద్దత కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని రామగుండం నగర పాలక సంస్థ కమిష నర్‌ జే అరుణశ్రీ ఆదేశించారు. మంగళవారం కార్పొ రేషన్‌ కార్యాలయంలో వార్డు అధికారులతో నిర్వహిం చిన సమావేశంలో మాట్లాడారు.

వానాకాలం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి

కోల్‌సిటీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): డివిజన్‌ వారీగా వర్షాకాల సన్నద్దత కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని రామగుండం నగర పాలక సంస్థ కమిష నర్‌ జే అరుణశ్రీ ఆదేశించారు. మంగళవారం కార్పొ రేషన్‌ కార్యాలయంలో వార్డు అధికారులతో నిర్వహిం చిన సమావేశంలో మాట్లాడారు. వర్షాల వల్ల ఎలాం టి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. డివిజన్‌లలో కాలువల్లో పూడిక తీత పనులు, లోతట్టు ప్రాంతాలను గుర్తించడం, అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేప ట్టాలన్నారు. ప్రతీ 15 రోజుల కొకసారి నగరపాలక సంస్థ ఉపరితల జలశ యాలను శుభ్రపరచాలన్నారు. నీటి నాణ్యత పరీక్షించడానికి టెలెండ్‌ ప్రాంతాల్లో తరచుగా క్లోరిన్‌ టెస్ట్‌లు చేపట్టాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ ప్రణాళిక గడువు ఈనెల 12తో ముగియనున్న నేప థ్యంలో 4, 6, 8, 10 తేదీలలో వార్డుసభలు నిర్వహిం చడానికి సన్నాహాలు చేయాలన్నారు. వార్డు సభల్లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు. కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి, అసిస్టెంట్‌ కమిషనర్‌ సంపత్‌, సెక్రెటరీ మహేశ్వర్‌రెడ్డి, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్‌ నవీన్‌, ఆంజనేయులు, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 11:50 PM