మెడికల్ బోర్డు నిర్వహించాలి
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:14 AM
సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని టీబీజీకేఎస్ నాయకులు నల్ల జెండాలతో ముట్టడించారు.
గోదావరిఖని, మార్చి 30(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని టీబీజీకేఎస్ నాయకులు నల్ల జెండాలతో ముట్టడించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతుందని, కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన ఉద్యోగు లను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉద్యోగులపైన ఏసీబీ, విజిలెన్స్ దాడులు చేస్తామని కాంగ్రెస్ నాయ కులు బెదిరింపులకు గురి చేయడం సరైంది కాదన్నారు. గతంలో గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు మీద 20వేల మందిని, డిస్మిస్ పేరిట 10వేల మందిని తొలగించిన నాటి ప్రభుత్వాలు ప్రస్తుతం అదే పోకడలో కొనసాగు తున్నాయని విమర్శించారు. అవినీతి విచారణ చేయాల్సింది ఉద్యోగులపైన కాదని, బొగ్గు గనుల కోసం తాపత్రయపడే మంత్రులపైన విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది, నెలకు మూడు మెడికల్ బోర్డులు నిర్వహి స్తారని ఆశలు పెట్టుకుంటే కార్మికులకు నిరాశే మిగిలిందన్నారు. రెగ్యులర్ మెడికల్ బోర్డు లేక అనేక మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఏసీబీ, విజిలెన్స్ పేరిట కాలయాపన చేస్తున్నారని, మెడికల్ బోర్డు నిర్వహించకపోతే సింగరేణి భవన్, ప్రజా భవ నాన్ని ముట్టడిస్తారని, దీనికి కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ధర్నాలో ఆర్‌జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరుగగా నాయకులు మాదాసు రామమూర్తి, నూనె కొమురయ్య, చెల్పూరి సతీష్, పొలాడి శ్రీనివాసరావు, చల్లా రవీందర్‌రెడ్డి, చెలుకలపెల్లి శ్రీనివాస్, రాజేశం, శేషగిరి, అభిషేక్ పాల్గొన్నారు.