Share News

జీవితాంతం ప్రజా ఉద్యమాలకే అంకితం

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:23 PM

జీవితాంతం ప్రజా ఉద్యమాలకే అంకితమని లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సత్తన్న అలియాస్‌ సంగ్రామ్‌ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం మం థనికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

జీవితాంతం ప్రజా ఉద్యమాలకే అంకితం

మంథని, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): జీవితాంతం ప్రజా ఉద్యమాలకే అంకితమని లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సత్తన్న అలియాస్‌ సంగ్రామ్‌ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం మం థనికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో లాగా మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళే ఆలోచన లేదని, ప్రజా సమస్యల సాధన కోసమే తన జీవితం అంకితమన్నారు. మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తుందనే నమ్మకం లేదన్నారు. నిపేధం ఎత్తివేస్తే ప్రజా సమస్యల సాధనకు అందరి అభిప్రాయాలను క్రోడీకరించుకొని భవిష్య త్‌లో ఉద్యమాలు చేస్తామన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను చూశాక తాము ఏ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్‌ కగార్‌తో దండ కారణ్యంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా క్షీణదశకు చేరుకుందన్నారు. కొందరు అగ్రనేతలు, క్యాడర్‌ అజ్ఞాతంలోనే ఉన్నారన్నారు. ఆపరేషన్‌ గడువు ముగిసినప్పటికీ ఫలితం ఏం సాధించారో పార్లమెంట్‌లో ప్రభు త్వం ప్రకటించిందన్నారు. ప్రభుత్వానికి గిట్టని వారిపై అర్బన్‌ నక్సలైట్‌ ముద్రతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యల సాధనకు విద్యార్థులు, యువత, ప్రజలు, మేధావులు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపుని చ్చారు. త్వరలోనే సొంత గ్రామంలో మంథని మండలంలోని శాస్త్రుల పల్లికి వచ్చి ప్రజలను కలిసి మాట్లాడుతానన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:23 PM