Share News

ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:54 PM

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామిని నెరవేర్చలేదని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు ఎస్‌ వీరయ్య ఆరోపించారు.

ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం

కళ్యాణ్‌నగర్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామిని నెరవేర్చలేదని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు ఎస్‌ వీరయ్య ఆరోపించారు. ఆదివారం గోదావరి ఖని చౌరస్తాలోని శ్రామిక భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో కార్మికవ ర్గానికి ఇచ్చిన హామీలు హామీగానే మిగిలిపోయాయని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నారు. సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్‌టీపీసీ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికు లకు కనీస వేతనాలు ఇవ్వకుండా బానిసల్లా పని చేయించుకుం టున్నారని, ప్రధాని మోదీ 2017లో చేసిన కనీస వేతనాల చట్టం 2022లో గడువు ముగిసినప్పటికీ ఇప్పటికీ కార్మికులకు కనీస వేత నాలు రూ.22వేలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ అమలు కాలే దన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కనీస హక్కులపై నిర్లక్ష్యం చేస్తుందని, ప్రతీ నెల ఈఎస్‌ఐ హాస్పిటల్‌కు రూ.2.4కోట్ల ఆదాయం వస్తుందని, రామగుండంలో ఇప్పటి వరకు ఈఎస్‌ఐ ఆసుపత్రిని నెల కొల్పడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయమన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షు డు కుమారస్వామి, ముత్యంరావు, రామాచారి, బిక్షపతి, కొముర య్య, జ్యోతి, వనజారాణి, రవీందర్‌, ప్రవీణ్‌, గణేష్‌, లక్ష్మారెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:54 PM