Share News

సింగరేణిని నామరూపాలు లేకుండా చేసేందుకు కుట్ర

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:26 PM

సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆర్‌జీ-1 జీడీకే ఓసీపీ-5లో శుక్రవారం బొగ్గు నిల్వలను మాజీ ఎమ్మె ల్యే పుట్ట మధూకర్‌, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించి ప్రభుత్వం చూపి స్తున్న బొగ్గు నిల్వలు లెక్కల వాస్తవాలు వివరించారు.

సింగరేణిని నామరూపాలు లేకుండా చేసేందుకు కుట్ర

గోదావరిఖని, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆర్‌జీ-1 జీడీకే ఓసీపీ-5లో శుక్రవారం బొగ్గు నిల్వలను మాజీ ఎమ్మె ల్యే పుట్ట మధూకర్‌, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించి ప్రభుత్వం చూపి స్తున్న బొగ్గు నిల్వలు లెక్కల వాస్తవాలు వివరించారు. సింగరేణి సంస్థలో వరుస కుంభకోణాలతో సంస్థనే ప్రశ్నార్థకం చేసేలా దోపిడీ జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కుంభకోణాలకు తెరలేపుతుందన్నారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం ఓబీ కాంట్రాక్టర్లు, సోలార్‌ పవర్‌ ప్లాం ట్‌, డిటోనేటర్‌ కాంట్రాక్ట్‌, పవర్‌ ప్రాజెక్టుల విషయంలో కుంభకోణాల పరంపర కొనసాగిస్తుందని ఆరోపిం చారు. సింగరేణి వెబ్‌సైట్‌ ఉన్న లెక్కల ప్రకారం ఆర్‌జీ-1 ఓసీపీ-5లో ఆరులక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వ చేసి ఉందని, సింగరేణి వ్యాప్తంగా ఆయా గనులపై నలభై లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వ ఉందని లెక్కల్లో ఉందన్నారు. ప్రస్తుతం మూడు లక్షల అరవై వేల టన్నులు అని చెప్తున్నారని, కానీ ఇక్కడ మొత్తం మట్టి బెడ్డలు, బండలు, పనికి రాని వాటిని కుప్పలు చేసి బొగ్గు అని చూపించే ప్రయత్నం చేస్తు న్నారని, కేవలం ఇక్కడ 50వేల మెట్రిక్‌ టన్నులు కూడా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. సంస్థను సర్వనాశనం చేయడంతో పాటు కార్మికుల జీవితాలు, ఆర్థిక అభివృద్దితో ఆటలు ఆడుతున్నారని ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాష్ట్ర మఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి నేతృత్వంలోనే అనేక అరాచకాలు జరుగు తున్నాయని ఆరోపించారు. ఇక్కడ 40లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉందనేది అబద్ధమన్నారు. ఈ విష యంపై సీబీఐ ఎంక్వైరీ జరుపాలని, లేని బొగ్గును ఎలా సృష్టిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజాధనాన్ని వృథా చేయడంలో ప్రభుత్వం ఎంత నిర ్లక్ష్యం చేస్తుందో అర్థం అవుతుందన్నారు. గోదావరిఖనికి వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు పలు విషయాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారని, అందులో ముఖ్యంగా డిపెండెంట్‌ ఉద్యోగాల విష యాన్ని ప్రస్తావించారని, ఈ విషయం బయటకు వస్తే పరువు పోతుందని అధికారులు జాగ్రత్త పడుతు న్నారని, కార్మికులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. వరుస కుంభకోణాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 12 , 2026 | 11:26 PM