Share News

పోరుజాత పేరిట కార్మికులను మభ్యపెట్టే కుట్ర

ABN , Publish Date - Mar 27 , 2026 | 11:27 PM

సేవ్‌ సింగరేణి పోరు జాత పేరిట కార్మికులను మభ్యపెట్టేందుకు మరో కుట్రకు ఏఐటీ యూసీ తెర లేపుతుందని ఆర్జీ-3 ఉపాధ్య క్షుడు కొటరవీందర్‌రెడ్డి ఆరోపించారు. సింగ రేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్‌ పరిధిలోని ఓసి పి-2లో ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

పోరుజాత పేరిట కార్మికులను మభ్యపెట్టే కుట్ర

రామగిరి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): సేవ్‌ సింగరేణి పోరు జాత పేరిట కార్మికులను మభ్యపెట్టేందుకు మరో కుట్రకు ఏఐటీ యూసీ తెర లేపుతుందని ఆర్జీ-3 ఉపాధ్య క్షుడు కొటరవీందర్‌రెడ్డి ఆరోపించారు. సింగ రేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్‌ పరిధిలోని ఓసి పి-2లో ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గతంలో టీబీజీకేఎస్‌ హయాంలో సింగరేణి మెడికల్‌బోర్డులో అవి నీతి జరిగాయని కొన్ని సంఘాలు ఏసీబీకి ఫిర్యాదు చేయడం వల్లే బోర్డు నిలిచిపో యిందనే విషయాన్ని గుర్తు చేశారు. గతంలో కంటే ప్రస్తుతం అవసరానికి కన్నా ఎక్కువ మందిని అన్‌ఫీట్‌ చేశారనే విషయంలో విచారణ కొనసాగుతుందన్నారు. ప్రాతినిధ్య సంఘంగా తాము కార్మికుల సమస్యల పై బాధ్యతయుతంగా వ్యవహరిస్తున్నామని తెలి పారు. స్ట్రక్చర్‌ కమిటీలో 90 సమస్యలను యాజ మాన్యం దృష్టి తీసుకెళ్ళా మని అందులో సగానికి పైగా పరిష్కారించగలి గామన్నారు. ఏఐటియుసి కల్లిబొల్లిమాటలను నమ్మి కార్మికులు మోసపోవద్దని సూచించారు. నాయకు లు ఎల్లంకి రామారావు, కుమారస్వామి, మడ్డిరాజ్‌కుమార్‌, సమ్మయ్య, మనోహరచారి, ఏఎన్‌చారి, బుద్దేసదానందం, దుండే రాజేందర్‌, ఓదెలు, పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 11:27 PM