కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి
ABN , Publish Date - May 04 , 2026 | 12:04 AM
అడవిసోమన్‌పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని ఆదివారం రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేశారు. అయితే గ్రామంలో కొనుగోలు కేం ద్రం నిర్వహణపై అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరుతో కొనుగోలు కేంద్రం ప్రారంభంలో జాప్యం చోటుచేసుకుంది.
మంథనిరూరల్, మే 3 (ఆంధ్రజ్యోతి): అడవిసోమన్‌పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని ఆదివారం రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేశారు. అయితే గ్రామంలో కొనుగోలు కేం ద్రం నిర్వహణపై అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరుతో కొనుగోలు కేంద్రం ప్రారంభంలో జాప్యం చోటుచేసుకుంది. మండలంలోని అన్ని గ్రామపంచాయ తీలలో కేంద్రాలు ప్రారంభంకాగా, అడవిసోమన్‌పల్లిలో ప్రారంభం కాకపోవడంతో మంథని-కాటారం ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. విషయం తెలుసు కున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పి రైతులను శాంతింపజేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో సోమవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిసింది.