ప్రభుత్వ కళాశాలల్లోనే ఉజ్వల భవిష్యత్తు
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:12 AM
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డి కల్పన ఆధ్వర్యంలో జిల్లాలో ప్రచారం ప్రారంభించారు. కళాశాలల్లోనే విద్యార్థులు చేరేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు గురువారం పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
సుల్తానాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డి కల్పన ఆధ్వర్యంలో జిల్లాలో ప్రచారం ప్రారంభించారు. కళాశాలల్లోనే విద్యార్థులు చేరేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు గురువారం పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థుల ఇండ్లకు వెళ్ళి ప్రిన్సిపాల్ నల్ల రాంచంద్రారెడ్డి, అధ్యాపకులు ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలని కోరారు. జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి డి కల్పన మాట్లాడుతు జిల్లాలో 14 కళాశాలలు ఉన్నాయని, వీటిలో పెద్దపల్లి, గోదావరిఖని, మంథని పట్టణాల్లో ప్రత్యేకంగా బాలికల కళాశాలలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో అన్ని కళాశాలల్లో అత్యధిక మందిని చేర్పించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రభుత్వ కళాశాలలో జేఈఈ, నీట్, ఎంసెట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, ప్రయోగశాలలు, స్కాలర్ షిప్పులు, బాలురకు హాస్టల్ సౌకర్యం, మధ్యాహ్న భోజనం ఆల్పాహారం సమకూరుస్తామని చెప్పారు. ప్రచార జాతలో భాగంగా పోస్టర్లను కళాశాల వద్ద ఆవిష్కరించారు. అధ్యాపకులు శ్రీధర్, మాధవిలత, దేవేందర్, గణేష్, హరికృష్ణ, సునిల్, రాజశేఖర్, రమేష్, రాజేందర్, అరుణ,అర్జున్, శ్రీనివాస్,మమత, సాయి వంశీ తదితరులు పాల్గొన్నారు.