Share News

యువశక్తి ప్రోగ్రాంతో యువతకు ఉజ్వల భవిష్యత్‌

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:47 PM

యువశక్తి ప్రోగ్రాంతో యువతకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. శిక్షణ పొందిన యువతులు సిలివెరి శ్రీజ, చిప్ప శశివర్షిణి భారత సైన్యం లో అగ్నివీర్‌ వాయు విభాగానికి ఎంపిక కావడం గర్వకారణమని కలెక్టర్‌ పేర్కొన్నారు.

యువశక్తి ప్రోగ్రాంతో యువతకు ఉజ్వల భవిష్యత్‌

పెద్దపల్లి కల్చరల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): యువశక్తి ప్రోగ్రాంతో యువతకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. శిక్షణ పొందిన యువతులు సిలివెరి శ్రీజ, చిప్ప శశివర్షిణి భారత సైన్యం లో అగ్నివీర్‌ వాయు విభాగానికి ఎంపిక కావడం గర్వకారణమని కలెక్టర్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వారిని అభినందించారు. ఆయన మాట్లాడుతూ దేశ సేవ కోసం భారత సైన్యం, భారత వైమానిక దళంలో చేరడం ఎంతో గర్వకారణమన్నారు. జిల్లా నుంచి మరింత మంది యువ త సైన్యంలో చేరాలన్నారు. యువత కోసం అవస రమైన శిక్షణ, మార్గ దర్శనం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, సహాయ సహకారాలు అందిస్తూ వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పని చేస్తోందన్నారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ లెంకల మహిపాల్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌కుమారి, పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 11:47 PM