మహిళా సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:40 AM
తెలంగాణ ఆడబిడ్డలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివా రం రంగంపల్లి ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
పెద్దపల్లి టౌన్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆడబిడ్డలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివా రం రంగంపల్లి ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా నాణ్యమైన చీరలను అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి పెట్రోల్ బంక్‌లు, ఇందిరమ్మ బస్సులు, మహిళా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం నియోజకవర్గంలోని 367 మంది లబ్ధిదారులకు రూ.1.65 కోట్లకు పైగా విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, పెద్దపల్లి పట్టణ, మండలానికి చెందిన 91 మంది లబ్ధిదారులకు రూ.91.10 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు ఆధునీకరిస్తున్నామని, ఆర్టీసీ బస్సు డిపో పనులు దసరా నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.