గౌడ కులస్తుల సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Nov 29 , 2026 | 11:03 PM
గౌడ సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం పట్టణంలోని పాత జెండా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. పాపన్న ఒక గౌడ సామాజిక వర్గానికే కాకుండా బహుజన విప్లవకారుడని కొనియాడారు.
సుల్తానాబాద్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): గౌడ సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం పట్టణంలోని పాత జెండా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. పాపన్న ఒక గౌడ సామాజిక వర్గానికే కాకుండా బహుజన విప్లవకారుడని కొనియాడారు. నాటి నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించి ఒక సైన్యంగా ఏర్పడి వారిని మట్టుబెట్టి 18 కోటలను జయించిన గొప్ప ధీరుడన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్నను గుర్తించి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్‌బాబు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ చొరవతో సీఎం రేవంత్‌రెడ్డి ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. అలాగే కాటమయ మోకులను అందజేస్తున్నామని తెలిపారు. త్వరలో నీర ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. గౌడ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం గౌడ సంఘం నేతలు విజయరమణరావును సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాదాకృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, వేగోళం పద్మఅబ్బయ్యగౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, బుర్ర శ్రీనివాస్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్‌గౌడ్, మాజీ జడ్పిటిసి అయిల రమేష్, ఆల్‌ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు మామిడిపల్లి బాపయ్య పాల్గొన్నారు.