టాస్క్ ద్వారా 62 మందికి ఉద్యోగాలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:39 PM
జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్‌లో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా పూర్తయిందని జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహించినట్లు తెలిపారు.
పెద్దపల్లి కల్చరల్ ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్‌లో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా పూర్తయిందని జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 380 మంది అభ్యర్థులు హాజరయ్యారని, అందులో 62 మంది ఎంపిక కాగా, మరో 9 మంది షార్ట్‌లిస్టు అయినట్లు పేర్కొన్నారు. కంపెనీ జీపీఈలో 14, ఏజే సొల్యూషన్‌లో 16 మంది. వైఎస్‌కేలో 26 మంది, ఎయిర్‌టెల్‌లో ఆరుగురు ఎంపికయ్యారు. జాబ్‌మేళాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయని, ఇలాంటి కార్యక్రమాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి సూచించారు. టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్, సెంటర్ ఇన్‌చార్జి కౌసల్య, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాళ్లు, ఇతర కళాశాల ప్రతినిధుల, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.