Share News

48 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

ABN , Publish Date - May 16 , 2026 | 11:39 PM

మండలంలోని నర్సింగాపూర్‌ సర్వే నంబర్‌ 273లో 130 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో నుంచి 107 ఎకరాల భూమిని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆక్రమించి సాగు చేస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో శనివారం తహసీల్దార్‌ దురిశెట్టి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించారు.

48 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

ధర్మారం, మే 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నర్సింగాపూర్‌ సర్వే నంబర్‌ 273లో 130 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో నుంచి 107 ఎకరాల భూమిని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆక్రమించి సాగు చేస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో శనివారం తహసీల్దార్‌ దురిశెట్టి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించారు. 107 ఎకరాల ఆక్రమిత భూమిలో 59 ఎకరాల భూమిని అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం ప్రకారం సాగుకు హక్కులు కలిగి ఉన్నారని గుర్తిం చారు.

మిగతా 48 ఎకరాలు సాగు చేస్తున్న 23 మంది రైతులు ఎలాంటి అసైన్‌మెంట్‌ లేకుండా అక్రమంగా పట్టాలు పొంది సాగు చేస్తున్నారని నిర్ధారించారు. అక్రమ పట్టాలకు సంబంధించిన 48 ఎకరాల ప్రభుత్వ భూమిని చదును చేసి ‘‘ఇది ప్రభుత్వ భూమి ఆక్రమించినచో చట్టపర మైన చర్యలు తీసుకోబడును’’ అని బోర్డులను ఏర్పాటు చేశారు. ఇటీవల మండలంలోని బొమ్మరెడ్డిపల్లి గ్రామ శివారులో 679లో 72.3 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం నర్సింగాపూర్‌లో 48 ఎకరాలు స్వాధీనం చేసుకోవడంతో మండలంలో ప్రభుత్వ భూము లను ఆక్రమించిన ఆక్రమదారుల గుండెల్లో గుబులు మొదలైంది. కాగ ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఎంతటి వారైన స్వాధీనం చేసుకుం టామని తహసీల్దార్‌ హెచ్చరించారు.

Updated Date - May 16 , 2026 | 11:39 PM