స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 2కే రన్
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:25 AM
నడకతో ఆరోగ్యం లభిస్తుందని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా, హెల్త్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లయన్స్‌క్లబ్ మగువ అధ్యక్షురాలు అం బటి అర్చన సంతోష్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
కళ్యాణ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): నడకతో ఆరోగ్యం లభిస్తుందని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా, హెల్త్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లయన్స్‌క్లబ్ మగువ అధ్యక్షురాలు అం బటి అర్చన సంతోష్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సీఐ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలు, వ్యాయామంపై దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మగువ అధ్యక్షురాలు అర్చన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే ఏదైన సాధించవచ్చన్నారు. వ్యాయామాన్ని జీవన శైలిగా అలవ ర్చుకోవాలని, ఫిట్ ఇండియా, హెల్త్ ఇండియా సందేశాన్ని ప్రతీ కుటుంబానికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. ర్యాలీ పీజీ కళాశాల మైదానం నుంచి ఎన్‌టీపీసీ వరకు కొనసాగింది. అనంతరం క్రీడాకారులకు పండ్లు, రాగిజావ అందజేశారు. లయన్స్‌క్లబ్ సభ్యులు చిందం స్వరూప, సోమారపు లావణ్య, భవాని, స్వరూప, శశికళ, గాలి సునీత, కొమురయ్య, కందుల సంధ్యారాణి, మాచిడి మహేందర్‌గౌడ్, ఒల్లాల సురేష్, అబ్దుల్ షకీల్‌తో పాటు పీజీ కాలేజీ వాకర్స్ పాల్గొన్నారు.