Share News

కామారెడ్డి జిల్లాలో ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం.. రియాక్టర్ పేలుడుతో ఐదుగురికి తీవ్ర గాయాలు!

ABN , Publish Date - Nov 06 , 2026 | 10:30 AM

కామారెడ్డి జిల్లాలో పారిశ్రామిక ప్రమాదం కలకలం రేపింది. భిక్కనూరు శివారులో ఉన్న ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లాలో ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం.. రియాక్టర్ పేలుడుతో ఐదుగురికి తీవ్ర గాయాలు!
Kamareddy Pharma Accident

కామారెడ్డి, నవంబర్ 6: జిల్లాలో పారిశ్రామిక ప్రమాదం కలకలం రేపింది. భిక్కనూరు శివారులో ఉన్న ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కార్మికులు గాయపడటంతో కంపెనీ ప్రాంగణంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. గాయపడిన ఐదుగురిలో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు కాగా, మరో ఇద్దరు స్థానికులుగా గుర్తించారు.


క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు వైద్యులు, అధికారులు వారిని హైదరాబాద్‌కు తరలించారు. అయితే.. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో కార్మికుల భద్రత, ఫార్మా కంపెనీల్లో ప్రమాదాల నివారణ చర్యలపై మరోసారి చర్చ మొదలైంది. అసలు రియాక్టర్ ఎందుకు పేలింది? సాంకేతిక లోపం ఏదైనా ఉందా? లేక భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను గుర్తించేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 12:30 PM