కాళేశ్వరంలో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు.. హరీష్ రావుకు బల్మూరి వెంకట్ స్ట్రాంగ్ కౌంటర్..
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:06 PM
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రాజెక్టులో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని, త్వరలోనే అసలు నిజాలు బయటపడతాయని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 22: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రాజెక్టులో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని, త్వరలోనే అసలు నిజాలు బయటపడతాయని ఆయన స్పష్టం చేశారు. ఎప్పటికైనా సత్యం, ధర్మమే గెలుస్తుందని హరీష్ రావుకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా బల్మూరి మాట్లాడుతూ.. ‘కాళేశ్వరంపై ఏదో విజయం సాధించినట్లు హరీష్ రావు సంబరపడుతున్నారు. ప్రాజెక్టు కట్టింది వాస్తవమైతే, అది కుంగిపోయింది కూడా అంతే వాస్తవం. ఘోష్ కమిషన్ ఇప్పటికే పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఎవరెన్ని డ్రామాలు ఆడినా ప్రజల సొమ్మును వృథా చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి పైసా లెక్క తేలుస్తాం.. దోషులకు శిక్ష పడే వరకూ పోరాడుతాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం
ధనుంజయ్, వాసుదేవ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వండి.. సిట్ లేఖలు