Share News

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ మార్పులు.. 513 మంది సిబ్బంది బదిలీ

ABN , Publish Date - Aug 19 , 2026 | 07:40 PM

తెలంగాణ పోలీస్‌ శాఖలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా శాఖలో మార్పులు చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ మార్పులు.. 513 మంది సిబ్బంది బదిలీ
DGP CV Anand

హైదరాబాద్: మారుతున్న సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీస్‌ శాఖలో పునర్‌వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ఎస్‌ఐబీ విభాగాలకు చెందిన 513 మంది సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. బదిలీ అయిన 513 మందిలో 5 మంది సీఐలు, 22 మంది ఎస్‌ఐలు, 14 మంది ఏఎస్‌ఐలు ఉన్నారు. వీరితో పాటు 84 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు డీజీపీ తెలిపారు.


ఈ బదిలీల్లో భాగంగా అత్యధికంగా 224 మందిని ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్డు భద్రత విభాగానికి కేటాయించారు. కొత్త బాధ్యతలు చేపట్టే ముందు సిబ్బందిని రెండు నెలల పాటు వివిధ విభాగాల్లో అటాచ్‌మెంట్‌ ద్వారా పనిచేయించనున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. సిబ్బంది విద్యార్హతలు, అనుభవం, సామర్థ్యం ఆధారంగా తుది బాధ్యతలను నిర్ణయించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు.


Also Read:

కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్

నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

Updated Date - Aug 19 , 2026 | 07:41 PM