Share News

గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి: డిప్యూటీ సీఎం భట్టి

ABN , Publish Date - Mar 10 , 2026 | 06:11 PM

రాబోయే మూడేళ్లలో శాశ్వత భవనాలు లేని అన్ని గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ వివిధ శాఖల అధికారులు, మంత్రులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.

గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి: డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka

హైదరాబాద్, మార్చి 10: రాబోయే మూడేళ్లలో శాశ్వత భవనాలు లేని అన్ని గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ(మంగళవారం) వివిధ శాఖల అధికారులు, మంత్రులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమై, హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి నిధుల మంజూరుపై సమీక్షించారు.


'తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ఉపాధి కల్పించే కోర్సులు ప్రవేశపెట్టాలి. గ్లోబల్ సమ్మిట్‌లో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలతో ఏటీసీ కోర్సులు ప్రారంభిస్తాము. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక మైనింగ్ ట్రైబల్ ఏజెన్సీల ద్వారానే జరగాలి' అని భట్టి విక్రమార్క వెల్లడించారు.


'ఐటీడీఏల సహకారంతో గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి. తెలంగాణ పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. కవ్వాల్, శ్రీశైలం టైగర్ జోన్ల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. ప్రభుత్వం ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై చర్యలు తీసుకుంటుంది.డ్రగ్స్ మహమ్మారి నివారణకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. డ్రగ్స్ దుష్ప్రభావాలపై కళారూపాల ద్వారా యువతకు అవగాహన కల్పించాలి' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.


ఇవి కూడా చదవండి:

మూసీ సుందరీకరణకు కాదు.. ఆ పేరుతో మూటల వేటకే వ్యతిరేకం: కేటీఆర్

పోలీస్ స్టేషన్‌ వద్ద ఇరు వర్గాలు బాహాబాహి.. రంగంలోకి దిగిన పోలీసులు

Updated Date - Mar 10 , 2026 | 06:14 PM