సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మసూద్ చాంది హత్య.. నిందితుల కోసం గాలింపు
ABN , Publish Date - Jun 12 , 2026 | 07:02 PM
హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మసూద్ చాంది దారుణ హత్యకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
హైదరాబాద్, జూన్12: నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మసూద్ చాంది దారుణ హత్యకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఆగంతకుల దాడిలో మసూద్ చాంది మృతి చెందినట్లు సమాచారం. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్‌తో కలిసి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
అలాగే ఈ ఘటన స్థలం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. వ్యక్తిగత విభేదాల ఏమైనా ఉన్నాయా? పాత శత్రుత్వాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇక సోషల్ మీడియా కార్యకలాపాల వివరాలను కూడా సేకరిస్తున్నారు. మృతుడి కాల్ డేటా, ఫోన్ రికార్డుల పరిశీలనతోపాటు అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ హత్య వెనుక కుట్ర కోణం ఉందా? అనే కోణంలో కూడా ఈ కేసును విచారిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు
రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ
Read Latest TG News And Telugu News