సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దారుణం
ABN , Publish Date - May 03 , 2026 | 11:12 AM
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురెళ్ళి.. రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
సికింద్రాబాద్, మే 03: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురెళ్లి.. రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైలు పట్టాలపై రెండు భాగాలుగా యువకుడి శరీరం విడిపోయింది. స్టేషన్‌లోని సిబ్బంది వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.