Share News

గ్రామీణ రోడ్ల అనుసంధానంతో సమగ్రాభివృద్ధి

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:34 AM

జాతీయ, రాష్ట్ర రహదారులతో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల అనుసంధానం సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తుందని ఆసియా డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ స్పెషలిస్ట్‌ (ఏడీబీ) శివరాజు దొడ్ల అన్నారు.

గ్రామీణ రోడ్ల అనుసంధానంతో సమగ్రాభివృద్ధి

  • ప్రజల భాగస్వామ్యం, స్థానిక అవసరాలు కీలకం

  • రోడ్ల నిర్మాణానికి 63 బిలియన్‌ డాలర్ల రుణం: శివరాజు దొడ్ల

  • భూసేకరణ పూర్తయితే వేగంగా రోడ్ల నిర్మాణం: అశుతోష్‌

  • పాత వంతెనలకు రెట్రోఫిట్టింగ్‌: మణిశేఖర్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ, రాష్ట్ర రహదారులతో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల అనుసంధానం సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తుందని ఆసియా డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ స్పెషలిస్ట్‌ (ఏడీబీ) శివరాజు దొడ్ల అన్నారు. ఐఆర్సీ సదస్సులో జరిగిన చర్చలో గ్రామీణ రహదారుల అనుసంధానం, వినూత్న రహదారుల రూపకల్పన, సంస్థాగత బలోపేతం గ్రామీణ సమాజాల్లోకి తీసుకొచ్చిన మార్పులను ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. భోపాల్‌లో మెరుగైన రోడ్ల వల్ల 30 కొత్త కాలనీల అభివృద్ధికి, పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు లభించిందన్నారు. నాలుగు దశాబ్దాలుగా దేశంలో రోడ్ల నిర్మాణానికి ఏడీబీ సుమారు 63 బిలియన్‌ డాలర్ల రుణం అందించిందని పేర్కొన్నారు.


ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన్‌ కింద ఏడీబీ అందించిన రుణాలతో అసోం, ఛత్తీ్‌సగడ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిసా, బెంగాల్‌లో 44,970 కి.మీ మేర రహదారుల నిర్మాణం జరిగిందని చెప్పారు. మరో చర్చలో హిమాచల్‌లోని కులు, లాహౌల్‌, స్పితి జిల్లాలను అనుసంధానించే 8,802 కి.మీ మేర అటల్‌ రోహితాంగ్‌ సొరంగం నిర్మాణంలో ఎదురైన సవాళ్లను వీఎ్‌సఎం పూర్వ చీఫ్‌ ఇంజనీర్‌ ఆర్‌ఎస్‌ రావు వివరించారు. ఈ సొరంగం అన్ని కాలాల్లో రాకపోకలకు అనువుగా ఉండటంతోపాటు మనాలి- సర్చు- లేహ్‌ మార్గం దూరం సుమారు 46 కి.మీ తగ్గిందన్నారు. భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ ముందే పూర్తి చేయడం ద్వారా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం త్వరగా పూర్తికావడంతోపాటు.. నిర్మాణ వ్యయమూ తగ్గుతుందని ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సభ్యుడు అశుతోష్‌ గౌతమ్‌ పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం నాటి వంతెనలనూ రెట్రోఫిట్టింగ్‌ ద్వారా పూర్వస్థితికి తీసుకురావచ్చునని సీఎ్‌సఐఆర్‌ పూర్వ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌. మణిశేఖర్‌ తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 06:34 AM