దారుణం.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన పని మనిషి..
ABN , Publish Date - May 08 , 2026 | 11:46 AM
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ సతీమణి తనూజ (55) హత్యకు గురయ్యారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ (55) హత్యకు గురయ్యారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నివాసంలో పని చేస్తున్న నేపాల్‌కు చెందిన పని మనిషి కల్పన ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసుల అనుమానం ప్రకారం, కల్పన మరో ముగ్గురితో కలిసి ముందస్తు ప్రణాళికతో హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తనూజ ఒంటరిగా ఉన్న విషయాన్ని తన గ్యాంగ్‌కు చెప్పిన కల్పన గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారితో కలిసి హత్యకు పాల్పడినట్లు సమాచారం.
హత్య అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకుని నిందితులు పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, 8 నెలలుగా ఆ ఇంట్లో కల్పన పని చేస్తోంది. మరోవైపు ఘటనాస్థలికి ఉన్నతాధికారులు చేరుకుని పరిశీలించారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాస ప్రాంతంలో హత్య జరగడం సంచలనంగా మారింది. హత్య విషయం తెలిసిన వెంటనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరుకున్నారు. కాగా, వినయ్ రంజన్ రాయ్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
యువత నిబద్ధతతో పనిచేయాలి: మంత్రి కొండా సురేఖ
దారుణం.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన పని మనిషి..