Share News

అడ్వొకేట్‌ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి

ABN , Publish Date - May 25 , 2026 | 06:01 PM

అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బెంగళూరు హైవేపై హత్యకు ఉపయోగించిన 'స్కార్కియో' వాహనం స్వాధీనం చేసుకుని, కారును విక్రయించిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అడ్వొకేట్‌ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి
Advocate Khaja Moinuddin Case

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ వద్ద కారు ఢీకొన్న ఘటనలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మరణించిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. బెంగళూరు హైవేపై హత్యకు ఉపయోగించిన 'స్కార్కియో' వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. భూ తగాదాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.


పోలీసుల వివరాల ప్రకారం, ఇంటి నుంచి బయటకు వచ్చిన ఖాజా మొయినుద్దీన్‌ను నిందితులు వాహనంతో ఢీకొట్టి హత్య చేసినట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్కార్పియో వాహనాన్ని ఇటీవల స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ కారును గతంలో విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తాను ఆ వాహనాన్ని ఆరు నెలల క్రితమే అమ్మేశానని వాహన యజమాని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వాహనం ఎవరి వద్ద ఉందన్న దానిపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.


ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కల్వకుర్తికి చెందిన వినయ్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరికొంతమంది అనుమానితుల కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


Also Read:

ప్రయాణంలో ఈ ఫుడ్స్ తింటే డేంజర్

మానసికంగా బలంగా మారాలంటే ఏమి చేయాలి?

For More Latest News

Updated Date - May 25 , 2026 | 06:01 PM