కర్నూల్ రేంజ్ డీఐజీకి షార్లెట్‌లో సన్మానం
ABN , Publish Date - May 25 , 2026 | 05:17 PM
నార్త్ కెరొలినాలోని షార్లెట్‌లో స్థానిక ఎన్నారైలు ఏపీ కర్నూల్ రేంజ్ డీఐజీ డా.ప్రవీణ్ కోయను ఘనంగా సన్మానించారు.
ఇంటర్నెట్ డెస్క్: నార్త్ కెరొలినాలోని షార్లెట్‌లో స్థానిక ఎన్నారైలు ఏపీ కర్నూల్ రేంజ్ డీఐజీ డా.ప్రవీణ్ కోయను ఘనంగా సన్మానించారు. మే 17వ తేదీ, ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. టీఏజీసీఏ, టీటీఏ, తానా, ఎన్నారై టీడీపీ షార్లెట్ విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆయనను సత్కరించే అవకాశం దక్కడం తమకు లభించిన గౌరవమని నిర్వాహకులు వ్యాఖ్యానించారు. స్థానిక తెలుగు సమాజానికి ఇది చారిత్రాత్మకమైన, భావోద్వేగపరమైన సందర్భంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 109 మందికి పైగా పాల్గొన్నారు.



ఈ వార్తలనూ చదవండి:
బర్త్ సర్టిఫికెట్ లేక గల్ఫ్‌లో తెలుగు కుటుంబం ఇక్కట్లపాలు! ఎట్టకేలకు..
అమెరికా రాజధానిలో ఘనంగా మినీ మహానాడు