కచ్చితత్వంతో కూడిన చికిత్సకు పరిశోధన, ఆవిష్కరణలే ఆధారం: నారా బ్రాహ్మణి
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:26 AM
ఆరోగ్య రంగంలో మున్ముందు కచ్చితత్వంతో కూడిన చికిత్స కీలకంగా మారుతుంది. ఇది పరిశోధన, నూతన ఆవిష్కరణలపై ఆధారపడి ఉంటుంది. ఆ దిశగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కృషి చేస్తునే ఉంటుంది’ అని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ట్రస్టు బోర్డు సభ్యురాలు నారా బ్రాహ్మణి పేర్కొన్నారు.
బసవతారకంలో సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ ఆంకాలజిస్టు 5వ వార్షిక సదస్సు
హైదరాబాద్: ఆరోగ్య రంగంలో మున్ముందు కచ్చితత్వంతో కూడిన చికిత్స కీలకంగా మారుతుంది. ఇది పరిశోధన, నూతన ఆవిష్కరణలపై ఆధారపడి ఉంటుంది. ఆ దిశగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కృషి చేస్తునే ఉంటుంది’ అని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ట్రస్టు బోర్డు సభ్యురాలు నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. బసవతారకం ఆస్పత్రిలో సొసైటీ ఆఫ్ జెనిటోయూరినరీ ఆంకాలజిస్టు సంస్థ నిర్వహిస్తున్న 5వ వార్షిక సదస్సు 2026ను శనివారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్బంగా బ్రాహ్మణి మాట్లాడుతూ... ‘ప్రతి వ్యక్తికి అవసరమైన చికిత్సతో పాటు మానవత్వం, కరుణ ఉండడం అవసరమని నేను భావిస్తున్నా. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో యూరో ఆంకాలజీ బృందం కచ్చితత్వంతో కూడిన క్యాన్సర్ చికిత్సను అందించడంలో ముందంజలో ఉండడం పట్ల గర్వంగా ఉంది’ అని అన్నారు. అపోలో ఆస్పత్రి సహాకరంతో నిర్వహించిన ఈ సదస్సులో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సంజయ్, సైంటిఫిక్ చైర్మన్ డాక్టర్ రాకేశ్ ఎం.శర్మ ప్రొఫెసర్ నోయెల్ క్లార్క్, ప్రొఫెసర్ మనీష్ కోహ్లీ, డాక్టర్ జాన్ క్రిస్టోడౌలియాస్, డాక్టర్ యాన్ షక్‌మన్, డాక్టర్ అలెజాండ్రో బెర్లిన్ తదితరుల నిపుణులు పాల్గొన్నారు.