నాంపల్లి అగ్ని ప్రమాదం.. సెల్లార్‌లో చిక్కుకున్న ఐదుగురి కోసం తీవ్ర ఆందోళన
ABN , Publish Date - Jan 25 , 2026 | 08:18 AM
హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా భవనంలో చిక్కుకున్న ఐదుగురి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ వారి ఆచూకీ తెలపాలని బంధువులు రోదిస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 25: హైదరాబాద్ నగరంలో రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో నిన్న (శనివారం) మధ్యాహ్నం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా భవనంలో చిక్కుకున్న ఐదుగురి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ వారి ఆచూకీ తెలపాలని బంధువులు రోదిస్తున్నారు. పోలీసుల నుండి సరైన సమాధానం లభించకపోవడంతో బాధిత బంధువులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
దీంతో పక్క భవనం నుండి గోడ పగలగొట్టి ప్రమాదం జరిగిన భవనం లోనికి వెళ్లేందుకు బంధువులు ప్రయత్నించారు. ఈ క్రమంలో బంధువులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. ఇప్పటికీ అగ్నిప్రమాదం జరిగిన భవనం నుంచి దట్టంగా పొగ వెలువడుతోంది.. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
అగ్నిప్రమాదం జరిగిన భవనంలోని రెండు సెల్లార్లలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ ఉంది. సెల్లార్ నుంచి దట్టమైన పొగలు వస్తుండటంతో రెస్క్యూ టీం ఇంకా భవనంలోకి వెళ్లలేకపోతోంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కాసేపట్లో నాంపల్లికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ టీం చేరుకోనుంది. భవనం దృఢత్వంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భవన సామర్థ్యాన్ని తనిఖీ చేసి ఇంజనీరింగ్ బృందం నివేదిక ఇవ్వనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో సూర్యజయంతి వేడుకలకు సర్వం సిద్ధం..
తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త వాహనాలపై శ్రీవారి దివ్య దర్శనం
For More AP News And Telugu News