Share News

మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి పొన్నం

ABN , Publish Date - Nov 04 , 2026 | 07:48 AM

తీవ్ర గాయాలతో నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.

మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి పొన్నం
Ponnam prabhakar

హైదరాబాద్, నవంబర్ 04: తీవ్ర గాయాలతో నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రవళిక ఆరోగ్యం మెరుగుపడి తిరిగి కోలుకొని వస్తారని ఆశించామని పేర్కొన్నారు. అయితే ఆమె మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇటీవల ప్రయాణికులతో జరిగిన వివాదంలో ప్రవళిక బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడింది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రవళిక మంగళవారం రాత్రి మరణించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు పరామర్శించిన సంగతి తెలిసిందే.


అక్టోబర్ 25వ తేదీన మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్‌ జి. ప్రవళికతో ప్రయాణికురాలు ఘర్షణకు దిగింది. ఈ క్రమంలో బస్సులో నుంచి కండక్టర్‌ను కిందకు తోసేందింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను హైదరాబాద్ తరలించి.. చికిత్స అందిస్తున్నారు. గత 10 రోజులుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర

వైసీపీని ఊడ్చేశారు!

For More TG News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 08:09 AM