Share News

భూ దందాలపై 10న పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:26 AM

రాష్ట్రంలో జరుగుతున్న భూ దందాలపై ఈనెల 10న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు.

భూ దందాలపై 10న పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌
Aleti Maheshwar Reddy

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల భూ కుంభకోణాలపై 200 కేస్‌ స్టడీస్‌ సిద్ధం చేశాం: ఏలేటి

రాష్ట్రంలో జరుగుతున్న భూ దందాలపై ఈనెల 10న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలకు భూ కుంభకోణాలకు సంబంధించి 200 కేస్‌ స్టడీస్‌ తాలూకు నివేదిక సిద్థం చేశామని తెలిపారు.


తొలి విడతగా 10-15 కీలక కేస్‌ స్టడీలను, డాక్యుమెంటరీ ఆధారాలను బట్టబయలు చేస్తామని, అనంతరం రెండో విడత పీపీటీని నిర్వహిస్తామని మహేశ్వర్‌రెడ్డి వివ రించారు. భూ దోపిడీపై బీజేపీ చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణను కూడా వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కూకట్‌పల్లి సర్వే నం. 1007లో వేల కోట్ల విలువైన ప్రైవేటు భూములను బినామీ కంపెనీలతో కబ్జా చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ భూమిని కాజేయడానికి అధికార పార్టీ బినామీ కంపెనీ ప్రహరీ కట్టే దుస్సాహసానికి ఒడిగట్టిందని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి...
పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన టీస్టాల్‌ నిర్వాహకుడు సుధాకర్‌ మృతి
కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడే సెస్‌లో రూ.32 కోట్ల అవినీతి
గౌరవం లేని చోట ఉండలేను
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 06:26 AM